నీచమైన కుల్లు నాలుకా నిన్ను రెండుగా చీరి చీల్చనా
కండ కండములుగ నరికినా చల్లబడదుగా మరిగె రక్తమా
నీచమైన కుల్లు నాలుకా నిన్ను రెండుగా చీరి చీల్చనా
కండ కండములుగ నరికినా చల్లబడదుగా మరిగె రక్తమా
నరం లేని నాలుకున్న మనిషి కూడ మృగమేగా
మృగములను వేటాడే మనిషై నే వచ్చాగా
అమాయపు ఆడపిల్ల బ్రతుకుపైన అబాండాలు
చేసె వాల్లు బ్రతకడనికాదు ఎన్నడర్హులూ
రౌద్రములే రగిలిపోవు రక్కసులను చూస్తుంటే
రుదిరములే మరిగిపోవు మాట తూలిపోతుంటే
కత్తుకకు చెవులగ్గె కీచకులను తెగ బాది
అబద్దాన్ని నిజం నుండి విడదీసె పని నాది
ఉక్కు పాదమేసితొక్కి నార తీసి తొలిచైనా
ఉక్రోషం ఉడుకుతుంటె ఉరి తీసి చంపైనా
నీచమైన కుల్లు నాలుకా నిన్ను రెండుగా చీరి చీల్చనా
కండ కండములుగ నరికినా చల్లబడదుగా మరిగె రక్తమా
విషాదాన్ని వెక్కిరించి వివదాలు శ్రుష్టిస్తే
విలయ ప్రలుల జ్వాలాగ్నులు పిడికిలిలో పుట్టిస్తా
ఉప్పు పట్టి తప్పు చేస్తె చెప్పు దెబ్బలు తినిపిస్తా
నిప్పు కక్కు ఉప్పెనలా ఇప్పుడు నే వణికిస్తా
రా రా రా రా నీ కింకా చావేరా
కోతల్లో దుర్మార్గం విజ్రుంబన చేస్తుంటే
శివమెత్తి తాండవమే ఆడేనే ముక్కంటే
రా రా రా రా
చూస్కో మునుముందూ జరిగే ఈ జగడంలో రగడేమిటొ
రా రా రా రా