అనగా అనగా మొదలై కథలు,
అటుగా ఇటుగా నదులై కదులు
అపుడో ఇపుడో దరి చేరునుగా,
కడలే ఓడై కడతేరునుగా
గడిచే కాలాన, గతమేదైనా స్మృతి మాత్రమే కదా
చివరకు మిగిలేది
చివరకు మిగిలేది
చివరకు మిగిలేది
చివరకు మిగిలేది
ఎవరు ఎవరు ఎవరు నువ్వంటే,
నీవు ధరించిన పాత్రలు అంతే
నీదని పిలిచే బ్రతుకేదంటే,
తెరపై కదిలే చిత్రమే అంతే
ఈ జగమంతా నీ నర్తనశాలై చెఋతున్న నీ కథే
చివరకు మిగిలేది విన్నావా మహానటి
చెరగని చేవ్రాలిది నీదేనే మహానటి
చివరకు మిగిలేది విన్నావా మహానటి
మా చెంపల మీదుగా ప్రవహించే మహానది
మహానటి (మహానటి)
మహానటి (మహానటి)
మహానటి (మహానటి)
మహానటి