ఒక్కరంటేయ్ ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు
ఒక్కరంటేయ్ ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు
ఒక తనువును ఎదిగిన కవలలు
ఒక తీరున కదలని తలపులు
ఒకరికొకరుగా మీరు
కలిసుంటే చాలు
అమ్మకథే పదివేలు
ఒక్కరంటేయ్ ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు
విడి విడి కుడి ఎడమలుగా
కలవంటూ ఎందుకలా
చేరి సగమున కలివిడిగా
ఒదగమంది అమ్మ కల
చెరో చెయ్యి మీదిగా
చంప నిమిరితే చాలు
మరో వారమే లేదనుకుంటూ
మెరిసిపోవా
నా చిరు నవ్వులు
ఒక్కరంటేయ్ ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు
అన్న వెంట అడవులకేగిన
లక్ష్మణుడి ఆదర్శం
ఆరమరికాలు దాటి సాగితే
అడుగడుగు మధుమాసం
నా కాలాలకు రెక్కలు మీరు
నా ఎనిమిది దిక్కులు మీరు
సంబరాల మీ సహవాసము
మెం కోరిన సంతోషం
మీ ఇద్దరి వృద్ధికా చూస్తూ
గడవాలి నా ప్రతి నిమిషం
ఒకరికొకరుగా మీరు
కలిసుంటే చాలు
అమ్మకథే పదివేలు
ఒక్కరంటేయ్ ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు
ఒక్కరంటేయ్ ఒక్కరు
ఇద్దరంటే ఇద్దరు