పవనజ స్తుతి పాత్ర
పావన చరిత్రా
రవిసోమ వర పుత్రా
రమణీయ గాత్రా
సీతా కళ్యాణ వైభోగమే..
రామా కళ్యాణ వైభోగమే
శుభం అని ఇలా
అక్షింతలు అలా దీవెనలతో
అటూ ఇటు జనం హడావిడితనం
తుళ్ళింతల ఈ పెళ్లి లోగిళ్ళలో
పదండని బంధువులొక్కటై
సన్నాయిల సందడి మొదలై
తథాస్తని ముడులు వేసే..హే..ఏ..
సీతా కళ్యాణ వైభోగమే..
రామా కళ్యాణ వైభోగమే
దూరం తరుగుతుంటే
గారం పెరుగుతుంటే
వణికే చేతులకు
గాజుల చప్పుడు
చప్పున ఆపుకొని
గడేయక మరిచిన తలుపే
వెయ్యండని సైగలు తెలిపే
క్షణాలిక కరిగిపోవా.. ఆఆఆ..
సీతా కళ్యాణ వైభోగమే..
రామా కళ్యాణ వైభోగమే