కుహు కుహు అని కోయిలమ్మ
తియ్యగా నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ…
బదులుగా నవ్వొకటి ఇవ్వమ్మా
కుహు కుహు అని కోయిలమ్మ
తియ్యగా నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ…
బదులుగా నవ్వొకటి ఇవ్వమ్మా
ఆ నవ్వులే సిరిమల్లెలై
పూయాలిలే…
నీ పెదవంచులో
ఈ పూలకి ఆరాటమే
చేరాలని జడకుచ్చుల్లాలో
ఓ ఇంద్రధనుసె వర్ణాల వానై
కురిసేను జల జల
చిట పట చినుకులుగా
కుహు కుహు అని కోయిలమ్మ
తియ్యగా నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ…
బదులుగా నవ్వొకటి ఇవ్వమ్మా
ఈ చల్లగాలి ఓ మల్లెపూవై
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం
నీ నవ్వు కోసం
ఓ మెరుపు లేఖే రాయాలి
సెలయేరు పైన
జలతారు వీణ
పలికెను గల గల
సరిగమపదనిసల
కుహు కుహు అని కోయిలమ్మ
తియ్యగా నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ…
బదులుగా నవ్వొకటి ఇవ్వమ్మా
నీలాలనింగి చుక్కల్ని తెచ్చి
నక్షత్ర మాలె వేయాలి
నీ కంటి నీరు వర్శిచకుండా
దోసిళ్ళ గొడుగే పట్టాలి
ఏ కష్టమైనా వుంటాను తోడై
తడపాడు అడుగున జతపడి నేనున్నా
కుహు కుహు అని కోయిలమ్మ
తియ్యగా నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మ…
బదులుగా నవ్వొకటి ఇవ్వమ్మా