అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా… పల
మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల
పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు
విహ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై…
అల వైకుంఠపురములో అడుగుమోపింది పాశమే…
విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చెనే…
అల వైకుంఠపురములో బంటుగా చేరే బంధమే…
అలై పొంగేటి కళ్ళలో కులాస తీసుకొచ్చేనే…
గొడుగు పట్టింది గగనమే… కదిలి వస్తుంటే మేఘమే…
దిష్ఠి తీసింది దీవెనై… ఘన ఖూస్మాన్డమే…
భుజము మార్చింది భువనమే… బరువు మోయంగ బంధమే…
స్వాగతించింది చిత్రమై… రవి సింధూరమే…
వైకుంఠపురములో…. ల ల ల లాలా
వైకుంఠపురములో…. ల ల ల లాలా
ల ల… ల ల ల లాలా…