అమ్మోరు తల్లికి నైవేధ్యం తెచ్చాం… చేత్తో
వేపాకులు పట్టుకొచ్చి వరమడిగాం…
అమ్మోరు తల్లికి నైవేధ్యం తెచ్చాం…
చేత్తో… వేపాకులు పట్టుకొచ్చి వరమడిగాం
అమ్మోరు తల్లికి నైవేధ్యం తెచ్చాం…
చేత్తో… వేపాకులు పట్టుకొచ్చి వరమడిగాం
త్రిశూలం చేతపట్టి రావే అమ్మ
తల్లీ త్రిశూలం చేతపట్టి రావే అమ్మ
ఈ తిరునాల్లో… మా కోర్కెలు తీర్చవమ్మా
అమ్మోరు తల్లి… అమ్మా అమ్మోరు తల్లి
అమ్మోరు తల్లి… అమ్మా అమ్మోరు తల్లి
అమ్మోరు తల్లి… అమ్మా అమ్మోరు తల్లి
అమ్మోరు తల్లి… అమ్మా అమ్మోరు తల్లి
సింహ వాహనముపైన… బంగారు రూపముతో
లోకమంతా ఏలుకొనే… దుర్గమ్మా రావమ్మా
దుర్గమ్మా రావమ్మా… అమ్మ దుర్గమ్మా రావమ్మా
ఆఆ… పెద్దపులిమీదెక్కి… కుంకుమ బొట్టు పెట్టి
కత్తి బల్లెం పట్టుకొని… రావే మైసమ్మా
రావే పోచమ్మ… అమ్మ రావే మాయమ్మా
అమ్మా నీ పేరు విన్న మరుక్షణమే… రోగాలన్ని మాయమవును
మా ఇంటి దైవం ఎల్లమ్మా…
రాక్షసుల తలకు చెయ్ తపాలాలు దరియించి
కొండంత అండ నీధై రావే పెద్దమ్మా
దీపాలు పెట్టి నిన్నే రోజు పూజిస్తాం
నిప్పుల్లో నడిచి… పాపాలన్నీ కడిగేస్తాం
అమ్మా నీ చూపే… మమ్ము చల్లంగా చూస్తే
కష్టం నష్టం ఏదీ… మా వైపే రాదంటా
పొగరెక్కి పోలేరమ్మ కోటకి వస్తే
విశ్వమంత కాచే తన కన్నులు పెంచి
విశ్వరూపం చూపించును మమ్మే దాచి
తలమీద దీపం పెట్టి నడుస్తున్నామమ్మా
పది తలల ఖడ్గధారి రక్షించా రావమ్మా
అమ్మలగన్నా అమ్మా… మా కష్టం తీర్చవమ్మా
అమ్మలగన్నా అమ్మా… ఓ దారి చూపవమ్మా
అమ్మోరు తల్లి… అమ్మా అమ్మోరు తల్లి
అమ్మోరు తల్లి… అమ్మా అమ్మోరు తల్లి
అమ్మోరు తల్లి… అమ్మా అమ్మోరు తల్లి
అమ్మోరు తల్లి… అమ్మా అమ్మోరు తల్లి