ఓ చిన్న నువ్వే వే చాలు పద పలకరిద్దాం
ఓ చిన్న మాటే చాలు బంధాల అల్లు కొందాం
ఏ ఊరు మీద పేరు అడిగి తెలుసుకుందాం
ఎవరైనా మన వారేగా వరస కలుపు కుందాం
ఒక నింగి ఒక నెలకి ఓకే ఊపిరి చిరుగాలికి
అనుబంధమై మనమందరం ఏ రోజు కలిసుందాం
ఆ సంగతే సరికొత్తగా ఈనాడిలా మరికొంతగా
మన మనసుకి గుర్తు ఉండగా మళ్లీ అనుకుందాం
దమ్ దమ్ అందమైన
బంధం అనుకున్న
బతికే నిత్యానందం
చుట్టూ ఇంత మంది చుట్టాలు ఉన్నవేళ
ఆహా ఎంత సంబరం
కన్నీళ్లు కైనా సంతోషాన్ని కైనా
కావాలి తోడు సదా ఎవరికైనా
పుష్పక విమానమే మరి
ప్రతి ఒక్కరూ మనసంటే
అనుబంధాలెన్నొచ్చినా అది ఇరుకై పొదంతే
మనసైన మన వారంతా
మన పక్కనే కొలువై ఉంటే
అరే కోరేందుకు ఇంకా మరేదీ లేదే
ప్రయాణమంతా పదనిసలే
దమ్ దమ్ అందమైన
బంధం అనుకున్న
బతికే నిత్యానందం
చుట్టూ ఇంత మంది చుట్టాలు ఉన్నవేళ
ఆహా ఎంత సంబరం
మారింది కాలం వేగం దీని రాగం
దగ్గర్లో దూరం ఎంతో ప్రమాదం
పనిమాలా ఓ కారణం ఏదో ఒకటి వెతికే
పదిమంది కలిసెట్టుగా ఏదో రోజు ఒక పండగ పుట్టిద్దాం
అప్పుడెప్పుడో తెలిసినవారు
ఇప్పుడిప్పుడే తెలిసినవారు
అసలు ఎప్పుడూ విడువక జత నడిచేలా
రవ్వంత బతుకున రంగుల పూద్దాం
(దమ్ దమ్ అందమైన
బంధం అనుకున్న
బతికే నిత్యానందం
చుట్టూ ఇంత మంది చుట్టాలు ఉన్నవేళ
ఆహా ఎంత సంబరం) x2