ప్రాణం నా ప్రాణం నీతో ఇలా..
గానం తొలి గానం పాడే వేళ
తారా తీరం
మన దారిలో కాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా
ప్రాణం నా ప్రాణం నీతో ఇలా..
గానం తొలి గానం పాడే వేళ
మన బాల్యమే ఒక పౌర్ణమి
ఒకే కథై అలా..
మన దూరమే అమావాస్యలే
చెరో కథై ఇలా..
మళ్ళి మళ్ళి జాబిలీ వేళ
వెన్నెల జల్లిందిలా నీ జంటగా
మారేలోపే ఈ నిమిషం కలలా
దాచేయాలి గుండెలో గురుతుల
తారా తీరం
మన దారిలో కాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా