తెల్లారే ఊరంతా తయ్యారే… ముస్తాబై పిలిచింది గుంటూరే
రద్దీలో యుద్ధాలే మొదలాయే… తగ్గేదే లేదంటే ప్రతివాడే
మరుపే రాని ఊరే గుంటూరే… అలుపంటూ లేదంటే సూరీడే
పగలంతా తడిసేలే సొక్కాలే… ఎన్నెన్నో సరదాలే కొలువుంటే
కారాలే నూరేది అంటారే…
బేరం సారం సాగే దారుల్లోన… నోరూరించే మిర్చి బజ్జి తగిలే
దారం నుంచి సారె సీరల దాక… గాలం ఏసి పట్నం బజారు పిలిసే
యే… పులిహోర దోశ – బ్రాడీపేట
బిర్యానికైతే – సుభాని మామ
వంకాయ బజ్జి – ఆరో లైను
గోంగూర చికెన్ – బృందావనం
మసాల ముంత – సంగడి గుంట
మాలు పూరి – కొత్తపేట
చిట్టి ఇడ్లీ – లక్ష్మి పురం
అరె… చెక్క పకోడీ – మూడొంతెనలూ
గుటకే పడక కడుపే తిడితే… సబ్జా గింజల సోడా బుస్సందే
పొడి కారం నెయ్యేసి పెడుతుంటే… పొగ చూరే దారుల్లో నోరూరే
అడిగిందే తడువంటా ఏదైనా… లేదన్నా మాటంటూ రాదంటా
సరదా పడితే పోదాం గుంటూరే…